Das Ka Dhamki: పిల్ల పడిపోయిందే...!

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక.

Updated : 25 Dec 2022 07:03 IST

విష్వక్‌సేన్‌ (Vishwaksen) కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’  (Das Ka Dhamki). నివేదా పేతురాజ్‌ కథానాయిక. కరాటే రాజు నిర్మాత. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘ఆల్మోస్ట్‌ పడిపోయిందే పిల్ల...’ అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. పూర్ణాచారి రచించిన ఈ గీతాన్ని, ఆదిత్య ఆర్కే ఆలపించారరు. లియోన్‌ జేమ్స్‌ స్వరపరిచారు. ఈ పాటకి  నాయకానాయికల జోడీ,  స్టైలిష్‌ విజువల్స్‌, యశ్‌ సమకూర్చిన నృత్యరీతులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దినేష్‌ కె.బాబు, సంభాషణలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని