Alone: కాళిదాస్‌ క్వారంటైన్‌ కష్టాలు

క్వారంటైన్‌, హోమ్‌ ఐసోలేషన్‌..ఈ పదాలను ప్రపంచం మర్చిపోలేదు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి యావత్‌ ప్రపంచం వణికిపోయింది. ఇంకా ఆ భయాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

Updated : 23 Oct 2022 13:52 IST

క్వారంటైన్‌, హోమ్‌ ఐసోలేషన్‌..ఈ పదాలను ప్రపంచం మర్చిపోలేదు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి యావత్‌ ప్రపంచం వణికిపోయింది. ఇంకా ఆ భయాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అదే ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఎలోన్‌’ (Alone). యూకేలో పనిచేసిన ఉద్యోగి కాళిదాస్‌ క్వారంటైన్‌లోకి వెళతాడు. ఇంట్లో ఒంటరిగా అతడు ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో మోహన్‌లాల్‌ పాత్రే ఒక్కటే తెరపై కనిపిస్తుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, సిద్ధిఖీ, నందుల గొంతులు మాత్రం వినిపిస్తాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. షాజీ కైలాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని