1970ల నాటి కథలో అమలా పాల్‌

కరోనా -లాక్‌డౌన్‌ కారణంగా వెండితెరలు మూతపడటంతో అందరూ మొబైల్‌ తెరకు వచ్చేశారు. ప్రేక్షకులే కాదు... దర్శకనిర్మాతలు ఈ దారిన వస్తున్నారు. వెబ్‌సిరీస్‌లు, వెబ్‌ సినిమాలు అంటూ టీ20 సినిమా గురించే ఆలోచిస్తున్నారు. దీనికి హీరోయిన్లు కూడా అతీతం కాదు.

Published : 11 Aug 2020 02:21 IST

హైదరాబాద్‌: కరోనా -లాక్‌డౌన్‌ కారణంగా వెండితెరలు మూతపడటంతో అందరూ మొబైల్‌ తెరకు వచ్చేశారు. ప్రేక్షకులే కాదు... దర్శకనిర్మాతలు ఈ దారిన వస్తున్నారు. వెబ్‌సిరీస్‌లు, వెబ్‌ సినిమాలు అంటూ టీ20 సినిమా గురించే ఆలోచిస్తున్నారు. దీనికి హీరోయిన్లు కూడా అతీతం కాదు. సమంత ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ చేయగా... నిత్య మేనన్‌, సాయిపల్లవి, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు అమలాపాల్‌ కూడా అదే పని చేస్తోంది.

1970ల నాటి కథతో తెలుగు- తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారిగా అమలా పాల్‌ కనిపించనుంది. అయితే ఈ సిరీస్‌ రెండో కావడం గమనార్హం. హిందీలో మహేశ్‌ భట్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి అమలా పాల్‌ ఇటీవల ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీని ద్వారా అమలాపాల్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అంటే అమలా పాల్‌ ఓటీటీలోనూ తన జోరు చూపించాలని చూస్తోందన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని