Amala Paul: మార్చురీలోకి వెళ్లా..!

‘‘నిజ జీవితంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాను. కానీ, ‘కడవర్‌’లో పోషించిన డాక్టర్‌ భద్ర పాత్రతో జీవితాన్ని మార్చే అనుభవాన్ని పోందాను’’ అంది   నటి అమలాపాల్‌.

Updated : 18 Aug 2022 13:48 IST

‘‘నిజ జీవితంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాను. కానీ, ‘కడవర్‌’లో పోషించిన డాక్టర్‌ భద్ర పాత్రతో జీవితాన్ని మార్చే అనుభవాన్ని పోందాను’’ అంది నటి అమలాపాల్‌. అనూప్‌ పనికర్‌  తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో అమలా.. డాక్టర్‌ భద్ర అనే పోలీస్‌ సర్జన్‌ పాత్రలో   నటించింది. ఈ పాత్ర కోసం ఆమె నిజమైన పోస్ట్‌మార్టం చూసినట్లు తాజాగా వెల్లడించింది. ‘‘డాక్టర్‌ భద్ర పాత్ర కోసం నేను చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేశా. చిత్ర దర్శకుడితో కలిసి అనేక ఆస్పత్రుల్ని సందర్శించా. అనేక మంది వైద్యులతో మాట్లాడా. వాళ్ల పనితీరును, అనుభవాల్ని తెలుసుకోవడానికి స్వయంగా మార్చురీలోకి వెళ్లా. పోస్ట్‌మార్టం చేయడాన్ని తొలిసారి ప్రత్యక్షంగా చూశా. చాలా షాకింగ్‌గా అనిపించింది. ఆ సమయంలో జీవితాన్ని మార్చే అనుభవాన్ని పొందా’’ అని అమలాపాల్‌ వివరించింది. ఈ సినిమా ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని