Ameesha Patel: పాక్ నటుడితో అమీషా పటేల్ వీడియో వైరల్.. నటి ఏం చెప్పిందంటే..!
పాకిస్థాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్(Imran Abbas)తో తాను డేటింగ్లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) స్పందించారు.
ముంబయి: పాకిస్థాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్(Imran Abbas)తో తాను డేటింగ్లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ‘‘ఇమ్రాన్ అబ్బాస్ నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. యూఎస్‌లో చదువుకుంటున్నప్పుడు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం. అతడు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే కావడంతో మేమిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఇటీవల అతడిని కలిశా. ఆ సమయంలో సరదాగా ఓ ఇన్‌స్టా రీల్ చేశాం. వీడియో చూడ్డానికి బాగుందని నెట్టింట్లో షేర్ చేశా. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో.. దీన్ని చూసిన వారు అతడితో నేను డేటింగ్లో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. వాటిని విని నేను బాగా నవ్వుకుంటున్నా’’ అని అమీషా వివరించారు. ఇటీవల బహ్రెయిన్‌కు వెళ్లిన అమీషా.. ఇమ్రాన్, ఇతర స్నేహితులతో సరదాగా గడిపారు. ఇందులో భాగంగానే ఓ రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి ఓ ప్రేమ పాటకు వీడియో చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్