టాలీవుడ్‌ హీరోలపై అమెరికన్‌ నటి ట్వీట్‌.. టాలీవుడ్‌ పవర్‌స్టార్స్‌ ఎవరంటూ ప్రశ్న

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు అమెరికన్‌ నటి రెబెకా గ్రాంట్‌. తాజాగా  ఈ చిత్రాన్ని వీక్షించిన ఈ భామ టాలీవుడ్ హీరోల గురించి ట్వీట్స్‌ చేశారు.

Published : 26 Oct 2022 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌ హీరోల గురించి ట్వీట్‌ చేశారు అమెరికన్‌ నటి రెబెకా గ్రాంట్‌. టెలివిజన్‌ వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వీక్షించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు. దీన్ని చూసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం.. ‘‘ప్రభాస్‌, రామ్‌చరణ్‌ ఇంతటి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోక ముందు టాలీవుడ్‌లో పవర్‌స్టార్స్‌ ఎవరు?’’ అని రెబెకా ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. మెగాస్టార్‌ చిరంజీవిని ట్యాగ్‌ చేశారు. ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్‌హీరోగా ఎదిగారని.. అద్భుతమైన నటుడు, డ్యాన్సర్‌ అని కామెంట్స్‌ చేశారు. దీనిపై స్పందించిన ఆమె.. ‘‘ప్రభాస్‌, రామ్‌చరణ్‌ కంటే ముందు భారతదేశంలో మెగా పవర్‌స్టార్‌ చిరంజీవేనా? అయితే ఆయన నటించిన ఏదైనా చిత్రానికి ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌ ఉంటే నాకు సూచించండి’’ అని రిప్లై ఇచ్చారు. దీంతో నెటిజన్లు చిరు నటించిన పలు సినిమా పేర్లను ఆమెకు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని