అమెరికన్‌ వీడియోలో ఇండియన్‌ సినిమా స్టంట్స్‌

మనకు నచ్చిన పాటలను, సన్నివేశాలను కట్‌ చేసి దానికి అనుగుణంగా డైలాగ్స్‌ పెట్టేసి ఎడిట్‌ చేసిన వీడియోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుత పరిస్థితులకు నప్పేలా వచ్చే వీడియోలను

Updated : 07 Dec 2022 13:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాటలను, సన్నివేశాలను కట్‌ చేసి దానికి అనుగుణంగా డైలాగ్స్‌ పెట్టేసి ఎడిట్‌ చేసిన వీడియోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుత పరిస్థితులకు నప్పేలా వచ్చే వీడియోలను వీక్షకులు ఆదరిస్తారు. అలాగే ఇప్పుడు భారతీయ సినిమాల్లోని స్టంట్స్‌ను మిక్స్‌ చేస్తూ ‘బ్లాక్ అండ్‌ పీస్‌’ ఓ మ్యూజికల్‌ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను రూపొందించడానికి ‘డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ’ని ఉపయోగించారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్‌ ‘రోబో’, రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సునీల్‌ ‘మర్యాద రామన్న’, రోహిత్‌ శెట్టి - అజయ్‌ దేవగణ్‌ ‘సింగం’ సినిమాల్లోని యాక్షన్‌ సన్నివేశాలను అద్భుతంగా ఎడిట్‌ చేశారు. తమపై భారతీయ సంస్కృతి, సంగీతం ప్రేరణ ఎంతో ఉందని ‘బ్లాక్‌ ఐడ్‌ పీస్‌’ యూట్యూబ్‌ పేజిలో సాంగ్‌ను ఎడిట్ చేసిన వారు పేర్కొన్నారు. ‘యాక్షన్‌’ పేరుతో విడుదలైన ఈ మ్యూజికల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని