Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర, నటి కియారా అడ్వాణీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) పొగడ్తల వర్షం కురిపించింది. వీరి జంట బాగుందని మెచ్చుకుంది.
ముంబయి: బాలీవుడ్ (Bollywood) నటీనటులపై తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈ భామ తాజాగా బీటౌన్ న్యూ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర (Siddharth Malhotra) - కియారా అడ్వాణీ (Kiara Advani)పై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ జోడీని చూస్తుంటే తనకెంతో ముచ్చటేస్తోందని చెప్పింది.
ఈ మేరకు తాజాగా సిద్ధ్-కియారా ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ‘‘ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో..! సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా నిజమైన ప్రేమ కనిపిస్తుంది. వాళ్లిద్దరిని చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. సిద్ధ్-కియారా ఫిబ్రవరి 6న పెళ్లి చేసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ కంగన ఈ విధంగా పోస్ట్ పెట్టడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
‘షేర్ షా’ కోసం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు సిద్ధార్థ్ - కియారా. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి .. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ప్రేమలో పడినట్లు బీటౌన్‌లో వరుస కథనాలు వచ్చాయి. ఇక, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 6న రాజస్థాన్‌లో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే వివాహం గురించి కియారా, సిద్ధార్థ్ ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!