A1Express: ఆమీగో ఫుల్‌ వీడియో వచ్చేసింది

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకుంది .

Published : 30 Apr 2021 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకుంది. త్వరలోనే డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి ఓటీటీ సన్‌నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఆమీగో’ ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సందీప్‌, లావణ్య హావభావాలు, పాట మధ్యలో వినిపించే వీళ్ల మాటలు ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని ఇన్నో జెంగా ఆలపించారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందించారు. హాకీ నేపథ్యంలో దర్శకుడు డేనియస్‌ జీవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయాపన్నెన్‌ నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని