Amigos: అమిగోస్‌ ఏ ఒక్కరినీ నిరాశపరచదు

‘‘అమిగోస్‌’ (Amigos) చాలా కొత్తగా ఉంటుంది. కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి.. ఇది ఏ ఒక్కరినీ నిరాశపరచదు. అందరూ ఆనందిస్తారు’’ అన్నారు కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram).

Updated : 10 Feb 2023 06:58 IST

కల్యాణ్‌రామ్‌

‘‘అమిగోస్‌’ (Amigos) చాలా కొత్తగా ఉంటుంది. కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి.. ఇది ఏ ఒక్కరినీ నిరాశపరచదు. అందరూ ఆనందిస్తారు’’ అన్నారు కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram). ఆయన.. ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) జంటగా రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన చిత్రమే ‘అమిగోస్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘కొత్త కథల్ని.. వైవిధ్యభరితమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాగే ఈ సినిమా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. కొత్త అనుభూతిని పంచిస్తుంది. కచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు, నటీనటులు, సాంకేతిక సిబ్బంది చాలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘భారతీయ చిత్రసీమలో ఇలాంటి కథతో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. నాకు కథ విన్నప్పుడే చాలా కొత్తగా అనిపించింది. తెరపై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులూ అదే ఫీలవుతారు. ఈ చిత్రంలోని తన మూడు పాత్రల కోసం కల్యాణ్‌రామ్‌ చాలా కష్టపడ్డారు’’ అంది నాయిక ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath). దర్శకుడు రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన సినిమా. ఇందులో చాలా థ్రిల్లింగ్‌ అంశాలున్నాయి. స్క్రీన్‌ప్లే చకచకా.. ఉత్కంఠభరితంగా సాగిపోతుంటుంది. కల్యాణ్‌ రామ్‌ను మరో కొత్త కోణంలో చూస్తారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా సర్‌ప్రైజ్‌ అవుతారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. నిన్నే చూశాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాం. మాకింత మంచి చిత్రం చేసినందుకు హీరో కల్యాణ్‌రామ్‌కు, దర్శకుడు రాజేంద్రకు కృతజ్ఞతలు. ఈ ఏడాది మాకిది హ్యాట్రిక్‌ హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని