Amigos Teaser: అమిగోస్‌.. పిల్లి ఎలుకా ఆట

‘‘మనం కలవడం ఓ అద్భుతం. విడిపోవడం అవసరం’’ అంటున్నారు కథానాయకుడు కల్యాణ్‌రామ్‌. ఇప్పుడాయన త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌’. రాజేంద్రరెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది.

Updated : 09 Jan 2023 06:54 IST

‘‘మనం కలవడం ఓ అద్భుతం. విడిపోవడం అవసరం’’ అంటున్నారు కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram). ఇప్పుడాయన త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). రాజేంద్రరెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఆశికా రంగనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథగా రూపొందిన చిత్రమిది. కల్యాణ్‌రామ్‌ ఇందులో మంజునాథ్‌, సిద్ధార్థ్‌, మైఖేల్‌ అనే మూడు పాత్రల్లో సందడి చేశారు. వీటిలో మైఖేల్‌ పాత్రను ప్రతినాయక ఛాయలున్న పాత్రలా ప్రచార చిత్రంలో చూపించారు. అందులో కల్యాణ్‌రామ్‌ ఆహార్యం.. ఆయన పలికించిన హావభావాలు, చేసిన యాక్షన్‌ హంగామా ఆసక్తి రేకెత్తించాయి. మరి అతనికి.. మంజునాథ్‌, సిద్ధార్థ్‌ పాత్రలకు మధ్య సాగే పిల్లి ఎలుకా ఆట ఏంటనేది తెరపై చూసి తెలుసుకోవాలి. సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌రాజన్‌.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని