అడవి దట్టం.. మనసు స్వచ్ఛం

ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్న అమిత్‌ తివారి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం... ‘నల్లమల’. అటవీ నేపథ్యంలో... వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న...

Published : 27 May 2021 11:40 IST

హైదరాబాద్‌: ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్న అమిత్‌ తివారి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం... ‘నల్లమల’. అటవీ నేపథ్యంలో... వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాజర్, భానుశ్రీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రధారులు. రవి చరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. ఈ సినిమాలోని అమిత్‌ తివారి లుక్‌ని విడుదల చేశారు. నల్లమల ప్రాంతపు జీవన విధానం అమిత్‌ పాత్రలో కనిపిస్తుందని... అతని కోపానికి, ఉద్వేగానికి కారణమేమిటన్నది తెరపైనే చూడాలని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నిగూఢమైన నల్లమల అడవిని ప్రతింబించే పాత్రలో కనిపిస్తారు అమిత్‌ తివారి. అడవి ఎంత దట్టమో, అంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ పాత్ర వ్యక్తిత్వం. ప్రపంచాన్ని శాసించే ఆయుధం తయారీ కోసం నల్లమలకి వచ్చిన ఇరాన్‌ సైంటిస్ట్‌గా నాజర్‌ కనిపిస్తారు. అటవీ సంపదని కొల్లగొట్టేందుకు వచ్చిన వారిని అమిత్‌ తివారి ఎదురించే తీరు ఆసక్తిని రేకెత్తిస్తుంది’’ అన్నారు. కాలకేయ ప్రభాకర్, అజయ్‌ ఘోష్, ఛత్రపతి శేఖర్, చలాకీ చంటి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం, పాటలు: పి.ఆర్, ఛాయాగ్రహణం: వేణు మురళి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని