Amitabh: జ్ఞానం, వివేకం గురించి అమితాబ్‌ ఏమన్నారంటే

ఒక్కోసారి తెలిసిన విషయమైనా సరే.. వేటితోనైనా ముడిపెట్టి చెబితే ఆసక్తికరంగా ఉంటుంది. ఆలోజింపజేసేస్తుంది కూడా. సరిగ్గా అలాంటి మాటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌. ప్రస్తుతం ‘కౌన్‌బనేగా కరోడ్‌’ సీజన్‌ 13 జరుగుతున్న విషయం తెలిసిందే.

Published : 16 Sep 2021 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కోసారి తెలిసిన విషయమైనా సరే.. వేటితోనైనా ముడిపెట్టి చెబితే ఆసక్తికరంగా ఉంటుంది.  సరిగ్గా అలాంటి మాటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌. ప్రస్తుతం ‘కేబీసీ’ సీజన్‌ 13 జరుగుతున్న విషయం తెలిసిందే. దానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అమితాబ్‌.. షోలో పాల్గొన్న ఫొటోను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేశారు. ఫొటోకి క్యాప్షన్‌గా జ్ఞానం, వివేకం.. ఈరెండింటిని టమోట, ప్రుట్‌ సలాడ్‌తో ముడిపెట్టి చెప్పారు. ‘‘ టమోట అనేది ఒక పండు అని గుర్తించడం జ్ఞానమైతే.. అలాంటి టమోటని తీసుకొచ్చి ఫ్రుట్‌ సలాడ్‌లో పెట్టకుండా ఉండటం వివేకం’’ అని లండన్‌ మాజీ ప్రధాని విన్ట్సన్‌ చర్చిల్ అన్న మాటను పోస్టు చేశారు. 78ఏళ్ల అమితాబ్‌ సామాజిక మాధ్యమాల్లో తరచూ జీవితం, ప్రపంచానికి సంబంధించిన పోస్టులు పెడుతూ నిత్యం యాక్టివ్‌గా నెటిజన్లతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్ను అనుసరించే వారి సంఖ్య 28లక్షలకు పైగా చేరుకుంది. గతనెల 27న విడుదలైన ‘చెహ్రే’లో అడ్వొకేట్‌ వీర్‌ సాహే పాత్రలో అలరించిన అమితాబ్‌.. వరుసగా నాలుగు చిత్రాలు..జూంద్‌, బ్రహ్మాస్త్ర, మే డే, గుడ్‌బైతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని