Kalki: అందుకే.. ‘కల్కి’ అంగీకరించడానికి ఏడాది ఆలోచించా: కమల్‌ హాసన్‌

‘కల్కి’ సినిమాను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు కమల్‌ హాసన్ అన్నారు. అలాగే ‘కల్కి’ విడుదలకు ముందు తాను రామచరితమానస్‌ చదువుతున్నట్లు అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు.

Updated : 25 Jun 2024 11:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నో రోజులుగా ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తోన్న ‘కల్కి’ (Kalki 2898 AD) మరికొన్ని గంటల్లో (జూన్‌ 27) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో ఎంతో శక్తిమంతమైన అశ్వత్థామ పాత్రను బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పోషించారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్‌ మొదలైన దగ్గరనుంచి అమితాబ్‌ వరుస అప్‌డేట్‌లతో అభిమానుల్లో  జోష్‌ పెంచుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. అలాగే కమల్‌హాసన్‌ కూడా ఈ సినిమాను అంగీకరించడానికి ఏడాది ఆలోచించినట్లు తెలిపారు. 

‘కల్కి’లో అగ్ర కథానాయకుడు కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.

ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?

అమితాబ్ బచ్చన్‌ తాజాగా తన బ్లాగ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘కల్కి రిలీజ్‌కు ముందు రామచరితమానస్‌ చదవడం ఆనందంగా ఉంది. ఎన్ని యుగాలు గడిచినా కొన్ని శాశ్వతంగా ఉంటాయి. శాశ్వతమైన శాంతి, ప్రశాంతత కోసం నేను ప్రార్థిస్తున్నాను. దీన్ని ఎప్పుడైనా.. ఎవరైనా చదవొచ్చు’ అని రాసుకొచ్చారు. అందులోని పద్యాలకు అర్థాలను వివరించారు. ఇక తాజాగా ఈ సినిమా టీమ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై అమితాబ్‌ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ‘‘కల్కి’లో విజువల్స్‌ నమ్మశక్యం కావు. అన్నింటినీ తెరపై అద్భుతంగా చూపించారు. ఇంతగొప్ప ప్రాజెక్ట్‌లో భాగమవడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అనుభవం. నాగ్అశ్విన్‌ ఈ కథ చెప్పి వెళ్లిన తర్వాత ‘ఇతను ఏం తింటున్నాడు. ఇంత గొప్పగా రాశాడు’ అని నేను చాలాసేపు ఆలోచించాను’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు