BIG B: ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ.. తనను తాను నిందించుకున్న అమితాబ్
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు క్షమాపణలు చెప్పారు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా సింగర్ పేరు తప్పుగా పడిందన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే అగ్ర నటుల్లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒకరు. అలాగే అభిమానులను గౌరవించడంలోనూ.. ఈ స్టార్ హీరో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అమితాబ్ చేసిన పనికి ఆయన అభిమానులే కాదు ఇండస్ట్రీలోని వారంతా ఆశ్చర్యపోతున్నారు.
శనివారం అమితాబ్ తన ట్విటర్ ఖాతా వేదికగా ఒక పాట గురించి ప్రస్తావించారు. ఇందులో ఆయన పాటను ఆలపించిన సింగర్ పేరును తప్పుగా పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు వరుస ట్వీట్స్ చేశారు. దీనిపై తన బ్లాగ్‌లో వివరంగా రాశారు. ‘‘నేను కావాలని తప్పు చేస్తానా.. ఒక వేళ చేసినా.. దాన్ని పబ్లిక్‌లో ఇలా పోస్ట్ చేస్తానా.. నేను సమాధానం టైప్ చేసే సమయంలో రెండు అక్షరాలు తప్పుగా టైప్ చేశాను. దీంతో సింగర్ పేరు మారిపోయింది. నేనెంత తెలివి తక్కువ వాడిని..! టైప్ చేసినప్పుడు చూసుకోకుండా చేశాను. ఈ విషయంలో నా తప్పును ఎత్తి చూపుతూ కామెంట్స్ చేసిన వాళ్లకు ధన్యవాదాలు. నేను ప్రతి ఆదివారం మీ అందరితో మాట్లాడడం కోసం నా షూటింగ్‌ను కూడా త్వరగా ముగించుకుని వస్తాను’’ అంటూ తనకు అభిమానులంటే ఎంత ఇష్టమో తెలిపారు.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కుర్రహీరోలతో పోటీపడుతూ నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ‘బటర్‌ప్లై’తో పాటు ‘ది ఉమేష్ క్రానికల్స్’ వంటి కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక వీటితో పాటు ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ - కె’ (Project K)లోనూ కీలకపాత్రలో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..