Bollywood: సినీరంగ ప్రవేశంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన స్టార్‌హీరో మనవరాలు..

అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) మనవరాలు నవ్య నవేలి(Navya Naveli) సినిమా రంగం అంటే తనకు ఆసక్తి లేదని మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సినిమా అవకాశాలు రాలేదని తెలిపింది. 

Published : 25 Jan 2023 15:52 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌ ముద్దుల మనవరాలు నవ్య నవేలి(Navya Naveli) అందరికీ సుపరిచితమే. సోషల్‌మీడియా వేదికగా అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) దంపతులు పలుసార్లు ఆమెపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే గతకొన్ని రోజులుగా నవ్య సినిమాల్లో నటించనుందనే వార్తలు నెట్టింట ప్రచారమవుతున్నాయి. దీనిపై తాజాగా ఆమె వివరణ ఇచ్చింది. 

‘‘నిజం చెప్పాలంటే నేను సినీరంగంలో అంతగా రాణించలేనని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు నచ్చిన రంగంలో మనం 100శాతం ఆసక్తిగా పనిచేయగలం. చిత్రపరిశ్రమ నాకు నచ్చే రంగం కాదు. నాకు దానిపై ఆసక్తి తక్కువ. నేనిప్పుడు నాకు ఇష్టమైన రంగంలో ఉన్నాను. నటనను వృత్తిగా ఎంచుకోవాలని నేను అనుకోవడం లేదు. నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇప్పటి వరకు నాకు ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు’’ అని చెప్పింది. 

ఆమె ఇప్పటికే ‘ఆరా హెల్త్‌’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. దాని ద్వారా ఆరోగ్యం, పరిశుభ్రత విషయాల్లో మహిళలకు తోడ్పాటు అందిస్తోంది. అయితే.. సినిమా వారసత్వం ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలోకి రావడం తనకు ఆసక్తి లేదని నవ్య ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని