గతాన్ని గుర్తు చేసుకున్న అమితాబ్‌ 

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 1970ల కాలాన్ని గుర్తు చేసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాత్రిపూట నిబంధనలు విధించిన సందర్భంగా అమితాబ్‌ స్పందించారు. ఈ నిబంధనల వల్ల పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోతాయన్నారు.

Published : 16 Apr 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 1970ల కాలాన్ని గుర్తు చేసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాత్రిపూట నిబంధనలు విధించడంపై అమితాబ్‌ స్పందించారు. ఈ నిబంధనల వల్ల పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోతాయన్నారు. సినిమా షెడ్యుళ్లు తీవ్రంగా ప్రభావితమవుతాయని.. అయినా.. ఆ తర్వాత నిదానంగా తిరిగి పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. రోజువారి పని చేసుకొని బతికే కార్మికుల గురించి ఆయన ఆవేదనగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్‌ మీడియాలో తన పాత ఫొటోలు పంచుకున్నారు. 1970ల్లో సంవత్సరానికి కేవలం 6 నుంచి 7 సినిమాలు మాత్రమే విడుదలయ్యేవి. 50 నుంచి 100 వారాల పాటు అలరించేవి. ఇప్పుడు విజయాలను ఓటీటీలే నిర్ధారిస్తున్నాయని బిగ్‌బీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని