Good Bye: రష్మికకు రిప్లై ఇచ్చిన అమితాబ్‌ బచ్చన్‌..!

కథానాయిక రష్మిక బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘గుడ్‌బై’ఈ సినిమాలో ఆమె ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు కూతురుగా నటించింది. అమితాబ్‌తో పనిచేసిన అనుభవం గురించి రష్మిక ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

Published : 03 Oct 2022 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయిక రష్మిక బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘గుడ్‌బై’. ఈ సినిమాలో ఆమె ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు కూతురుగా నటించింది. ఆయనతో కలిసి నటించడంపై రష్మిక ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ‘‘అమితాబ్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి సినిమా. మొదటి సినిమానే ఇంత పెద్ద సూపర్‌స్టార్‌తో చేయడం ఆనందంగా ఉంది’’అని అన్నారు. వెంటనే పక్కనే ఉన్న అమితాబ్‌ ఆమె మాటలకు ‘‘నాకు కూడా మీలాగే ఉంది’’అంటూ రిప్లై ఇచ్చారు. అమితాబ్‌పై రష్మిక తనకున్న అభిమానాన్ని తెలపడం ఇదే మొదటిసారి కాదు. ‘గుడ్‌బై’ ట్రైలర్‌ లాంచ్‌లోనూ రష్మిక మొదటిసారి అమితాబ్‌ను కలిసినప్పుడు కలిగిన అనుభవాన్ని పంచుకుంది.

వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీనా గుప్త, సాహిల్‌ మెహతా, శివిన్‌ నారంగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 7న ఈ సినిమా ప్రేక్షుకులను పలకరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని