
Amitabh Bachchan: అమితాబ్‌పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్.. స్పందించిన నటుడు
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తాజా పోస్ట్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఎగతాళిగా మాట్లాడారు. కారణమేంటంటే.. ఎప్పటిలానే బిగ్ బీ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులకు ఆదివారం ‘గుడ్ మార్నింగ్’ విషెస్ చెప్పారు. 11: 26 గం.లకు ఆ పోస్ట్ పెట్టారు. ఈ ఒక్క చిన్న పోస్టే విమర్శలకు దారి తీసింది. ‘ఇంకా ఉదయమా?’, ‘ఓల్డ్‌మ్యాన్.. ఇది ఉదయం కాదు మధ్యాహ్నం’ అంటూ పలువురు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. వీటిపై అమితాబ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘నన్ను హేళన చేసినందుకు థ్యాంక్స్. ముఖ్యమైన పనికోసం రాత్రి చాలా సేపు మెలకువతోనే ఉన్నా. అందుకే నిద్రలేవడం ఆలస్యమైంది. లేచిన వెంటనే మీకు శుభాకాంక్షలు చెప్పా. దానికి మీరు బాధపడితే నన్ను క్షమించండి. మీ వృద్ధ్యాప్యంలో మిమ్మల్ని ఎవరూ అవమానించకూడదని దైవాన్ని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ బదులిచ్చారు. ఈ విషయంలో చాలామంది అమితాబ్‌కు మద్దతు పలికారు. ‘‘అమితాబ్ పని పట్ల ఈ వయసులోనూ ఎంత నిబద్ధతతో ఉంటున్నారో తెలియజేసేందుకు ఇది నిదర్శనం’’ అని ఆయన అభిమానులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్
-
General News
Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
-
World News
Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
-
Sports News
Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
-
Business News
Crypto crash: క్రిప్టో క్రాష్.. ఇంకా ఎంత దూరం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత