Amitabh Bachchan: అందుకే అభిమానుల్ని కలిసినప్పుడు చెప్పులు తీసేస్తాను..: బిగ్‌బీ

బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అభిమానుల్ని ఎంతగా ఆరాధిస్తారో అందరికీ తెలిసిన విషయమే. అభిమానుల్ని కలిసినప్పుడు తాను చెప్పులు ఎందుకు తీసేస్తారో తాజాగా ఆయన బ్లాగ్‌లో వివరించారు. 

Updated : 03 Nov 2022 12:15 IST

హైదరాబాద్‌: వయసుతో సంబంధం లేకుండా నేటితరం నటులతో పోటీపడి నటిస్తుంటారు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan). ఆయనకు అభిమానులంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పారు. ఎలాంటి విషయంలో అయినా ఆయన అభిమానుల గురించి స్పందించే తీరు ఎంతో మంది నటులకు ఆదర్శం. సోషల్‌ మీడియాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే బిగ్‌బీ తన అభిమానుల కోసం ‘జల్సా’ అనే కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఆదివారం ఆయన అభిమానులను నేరుగా కలిసి వాళ్లతో కొంత సమయం గడుపుతారు. కొవిడ్‌ కారణంగా ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్లు ఆపేశారు. తిరిగి రెండు సంవత్సరాల తర్వాత దానిని ప్రారంభించారు. అయితే, అమితాబ్‌ అభిమానుల దగ్గరకు వెళ్లినప్పుడు చెప్పులు ఎందుకు తీసేస్తారో తాజాగా ఆయన బ్లాగ్‌లో తెలిపారు.

‘‘నేను ఎప్పుడు ‘జల్సా’ కార్యక్రమంలో అభిమానుల్ని కలిసినా చెప్పులు తీసేస్తాను. అభిమానులు నాకు దైవంతో సమానం. వాళ్లంటే నాకు భక్తి. ప్రతి ఆదివారం జరిగే జల్సాను  నేను ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావిస్తాను. నన్ను ఫోన్‌లో ఫొటోలు తీసుకుని వారు ఆనందిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’’ అని తన బ్లాగ్‌లో వెల్లడించారు బిగ్‌బీ. ఇది చదివిన అభిమానులు మీరు నిజమైన హీరో అంటూ అమితాబ్‌ను ప్రశంసిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని