ఆసుపత్రిలో బిగ్‌బీ?

బిగ్‌బీ అమితాబ్‌ సోషల్‌మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. ఫ్యాన్స్‌ కోసమే ప్రత్యేకంగా ఓ బ్లాగ్‌ ద్వారా టచ్‌లో ఉంటారు. తాజాగా ఆయన తన ఆరోగ్యానికి సంబంధించి ఒక అప్‌డేట్‌ బ్లాగ్‌లో ఉంచారు.  ఓ సర్జరీ నిమిత్తం ఆసుపత్రికి వెళుతున్నట్టు

Updated : 28 Feb 2021 20:30 IST

ముంబయి: బిగ్‌బీ అమితాబ్‌ సోషల్‌మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. ఫ్యాన్స్‌ కోసమే ప్రత్యేకంగా ఓ బ్లాగ్‌ ద్వారా టచ్‌లో ఉంటారు. తాజాగా ఆయన తన ఆరోగ్యానికి సంబంధించి ఒక అప్‌డేట్‌ బ్లాగ్‌లో ఉంచారు.  ఓ సర్జరీ నిమిత్తం ఆసుపత్రికి వెళుతున్నట్టు రాసుకొచ్చారు. కానీ,  ఆ సర్జరీ దేని కోసం, పూర్తయిందా? లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆయన పోస్టుకు అభిమానులు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కొందరు పోస్ట్‌ చేయగా, బిగ్‌బీకి ఏమైందంటూ మరికొందరు ఆరా తీశారు. ప్రస్తుతం బిగ్‌బీ అజయ్‌దేవగణ్‌తో కలిసి ‘మేడే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆ సెట్‌లో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. దానికి క్యాప్షన్‌గా ‘నిమ్మకాయ నీరు నా దాహానికి, జాకెట్‌, కళ్లద్దాలు షూటింగ్‌కి’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఆయన నటించిన చిత్రాల్లో ‘ఛెహ్రే’ ఏప్రిల్‌ 30న విడుదలవుతుండగా, ‘జుంద్‌’ జూన్‌ 18న థియేటర్లలోకి రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని