Amitabh bachchan: నా మీద కోపం వస్తే తనకు చాక్లెట్‌ ఇస్తా..: బిగ్‌ బీ

అమితాబ్‌ బచ్చన్‌ పరిచయం అవసరం లేని పేరు. వయసుతో సంబంధం లేకుండా నేటి యువ నటులతో పోటీపడుతుంటారు. ఎందరో సినీ తారలకు ఆయన ఒక మార్గదర్శి.  సినిమాలు, టి.వి షోలు, సోషల్‌మీడియాల ద్వారా ఎప్పుడూ తన అభిమానులకు చేరువలో ఉంటుంటారు.

Published : 23 Sep 2022 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమితాబ్‌ బచ్చన్‌ పరిచయం అవసరం లేని పేరు. వయసుతో సంబంధం లేకుండా నేటి యువ నటులతో పోటీపడుతుంటారు. ఎందరో సినీ తారలకు ఆయన ఒక మార్గదర్శి.  సినిమాలు, టి.వి షోలు, సోషల్‌మీడియాల ద్వారా ఎప్పుడూ తన అభిమానులకు చేరువలో ఉంటారు. ఇటీవల ఓ ప్రముఖ షోలో కంటెస్టెంట్‌ అడిగిన పశ్నకు బిగ్‌బీ సరదాగా సమాధానం చెప్పారు. మీపై మీ మనవరాలికి కోపం వస్తే ఏం చేస్తారంటూ అడగ్గా.. బిగ్‌బీ నవ్వుతూ ‘చాక్లెట్‌ ఇచ్చి కోపాన్ని తగ్గిస్తా’ అని బదులిచ్చారు.

‘‘నేను నా మనవరాలు ఆరాధ్యతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా. ఉదయం ఓ అరగంట మాత్రమే తనతో ఉంటున్నా. ఆ తర్వాత తను స్కూల్‌కు వెళుతుంది. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది.  నేను ఇంటికి వెళ్లేసరికి రాత్రి  అవుతుంది. అప్పటికి తను నిద్రపోతుంది. టెక్నాలజీకి ధన్యవాదాలు చెప్పాలి. మేము సమయం దొరికినప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుంటుంటాం. ఆదివారం మాత్రమే మా ఇద్దరికీ సమయం కుదురుతుంది. ఒకవేళ తనకు నాపై కోపం వస్తే.. చాక్లెట్‌ ఇచ్చి కోపాన్ని తగ్గిస్తాను. తనకు పింక్‌ కలర్‌ అంటే ఇష్టం ఆ కలర్‌ హెయిర్‌ బ్యాండ్‌ ఇస్తాను.  అప్పుడు తను సంతోషిస్తుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని