Amitabh Bachchan: సామాన్యుడి బైక్‌పై షూటింగ్‌కు వెళ్లిన అమితాబ్.. వైరలవుతోన్న పోస్ట్
ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఓ వ్యక్తి బైక్ పై షూటింగ్ స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరలవుతోంది.
ముంబయి: వెళ్లే దారిలో సెలబ్రిటీలు కనిపిస్తేనే అభిమానుల ఆనందానికి హద్దులుండవు. అలాంటిది అనుకోకుండా ఓ పెద్ద సెలబ్రిటీ మన బైక్‌పై ప్రయాణిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) లాంటి అగ్ర హీరో అయితే ఆ అనుభూతి చెప్పడానికి మాటలు చాలవు. ముంబయిలో బిగ్ బీ చేసిన ఈ పనికి ప్రస్తుతం ఓ వ్యక్తి తెగ సంబరపడిపోతున్నాడు.
నిరాడంబరంగా ఉండే సినీ తారల్లో అమితాబ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయన చాలా సింపుల్‌గా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. తాజాగా మరోసారి ఓ సామాన్యుడి బైక్‌పై షూటింగ్ స్థలానికి వెళ్తూ ముంబయి వీధుల్లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెబుతూ బిగ్‌బీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు’’ అంటూ అతడికి ధన్యవాదాలు చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అతడెవరో చాలా లక్కీ’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘మీరు నిజంగానే మెగాస్టార్’ అని మరొకరు అన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘గుడ్‌బాయ్’ చిత్రంతో అమితాబ్ అలరించారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ (Project K)లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు (Prabhas) జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
బ్రిజ్‌భూషణ్‌కు యూపీ షాకిచ్చిందా..?వాయిదా పడిన ఎంపీ ర్యాలీ
-
Sports News
IPL 2023: ధోనీ మేనియాగా ఈ ఐపీఎల్ సీజన్ : రమీజ్ రజా
-
World News
Russia: రష్యాలో ఐఫోన్లపై అమెరికా ‘హ్యాకింగ్’..!
-
General News
CM Jagan: రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
YS bhaskar reddy: భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా