Kalki: ‘కల్కి’ చరిత్రలో నిలిచిపోతుంది: అమితాబ్‌ బచ్చన్‌

ప్రస్తుత పరిస్థితుల్లో ‘కల్కి’ని తెరకెక్కించడం పెద్ద సాహసమని అమితాబ్ బచ్చన్ అన్నారు. చిత్రబృందాన్ని  ప్రశంసించారు.

Published : 06 Jul 2024 08:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అశ్వత్థామ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఆయన ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఎక్కడ విన్నా కల్కి గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. దీన్ని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

‘నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. 6000 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని నేటి సమాజానికి అందించాలనుకోవడం గొప్ప ఆలోచన. 2024లో దీన్ని తెరకెక్కించాలనుకోవడం ఆయన చేసిన సాహసం. లక్షల శ్లోకాలతో కూడిన పౌరాణిక ఇతిహాసం మహాభారతాన్ని అద్భుతంగా వివరించినందుకు తొలుత నిర్మాణసంస్థకు ధన్యవాదాలు. నేను ఈ దర్శకనిర్మాతల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. కురుక్షేత్రం యుద్ధం తర్వాత ఏం జరిగింది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘కల్కి’ చూసిన వారంతా దాని రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ కథ మీ అంచనాలకు మించి ఉంటుంది. నేను ‘కల్కి 2898 AD’ చిత్రం గురించి నాగ్ అశ్విన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాను. అది త్వరలోనే టెలికాస్ట్‌ అవుతుంది’’ అని అమితాబ్‌ వెల్లడించారు.

‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్‌బాబు: నాగ్‌ అశ్విన్‌ సమాధానమేంటంటే?

ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తాజాగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) మీడియాతో ముచ్చటించారు. పార్ట్‌2 గురించి విశేషాలు పంచుకున్నారు. రెండో భాగంలో మరిన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయన్నారు. స్క్రిప్టే ఓ పెద్ద సవాల్‌గా ఉందన్నారు. మొదటి పార్ట్‌లో కావాలనే ప్రభాస్‌ (Prabhas) పాత్రను వినోదాత్మకంగా చూపించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ‘కల్కి’ దాదాపు రూ.774 కోట్లు వసూళ్లు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు