KBC సీజన్‌ 13తో అమితాబ్‌

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నారు. భారతీయ టెలివిజన్‌ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’కి పేరుంది. ఆయన ‘కేబీసీ’ సీజన్‌ 13కి హోస్ట్గా వ్యవహరించేందుకు సిద్ధమైయ్యారు.

Published : 06 May 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నారు. భారతీయ టెలివిజన్‌ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి పేరుంది.  తాజాగా సోనీ టీవీ తన ట్వీటర్‌ వేదికగా తెలియజేస్తూ..‘‘కౌన్ బనేగా క్రోరోపతి 13వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు అమితాబ్ బచ్చన్ త్వరలో వస్తున్నారు. ఈ సీజన్‌ రిజిస్ట్రేషన్ మే 10 నుంచి ప్రారంభం కానుంది’’ అని ప్రకటించింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. కేబీసీ 2000లో సంవత్సరంలో ప్రారంభమైంది. 20 సంవత్సరాలుగా విజయవంతంగా ఈ షో నడుస్తోంది. షో మొదటి, రెండు సీజన్లకి అమితాబ్  హోస్ట్ వ్యవహరించారు. తర్వాత మూడో సీజన్‌లో షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు. గత ఏడాది అన్ని జాగ్రత్తలు తీసుకొన్ని కొవిడ్‌ సమయంలోనూ బిగ్ బి గేమ్‌ షో చేశారు. ఇందులో కొన్ని కొత్త అంశాలను చేర్చారు. ఈ సీజన్లో పాల్గొన్న పోటీదారులతో అమితాబ్‌ సామాజిక దూరాన్ని పాటిస్తూ షో నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని