Updated : 27 Aug 2021 21:13 IST

Green India Challenge: రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌

హైదరాబాద్‌ : ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మొక్కలు నాటారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్‌బీతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్‌, హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీని అమితాబ్‌ ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. ఎంపీ సంతోష్‌ 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.


 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts