Ammu: ‘అమ్ము’ చేసినందుకు చాలా గర్వంగా ఉంది: ఐశ్వర్య లక్ష్మి
ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో రానున్న సినిమా ‘అమ్ము’. ఈ చిత్రం ఈరోజు(october19) నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.
హైదరాబాద్: తాజాగా విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్1’లో నటి ఐశ్వర్య లక్ష్మి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈమె ప్రధాన పాత్రలో రానున్న సినిమా ‘అమ్ము’. ఈ చిత్రం నేటి నుంచి (october19) అమెజాన్ ప్రైమ్ వేదికగా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘అమ్ము’ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా. ఇది ప్రస్తుత కాలానికి సరిపోయే కథ. ఇందులో నటించినందుకు మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు.
కుటుంబ కథా నేపథ్యంతో రానున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, సింహా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చారుకేశ్ శేఖర్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.
ప్రత్యేక ప్రదర్శన..
ఈ సినిమాను నగరంలోని ఎ.ఎం.బి. సినిమాస్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. దర్శకులు దేవ కట్టా, కార్తిక్ సుబ్బరాజు, నటులు నవీన్ చంద్ర, నిహారిక కొణిదెల, స్వాతి, నిర్మాతలు శరత్ మరార్, రాజ్ కందుకూరి తదితరులు ప్రీమియర్‌ను చూశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్