Ammu: అక్టోబర్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్న ‘అమ్ము’..!

ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అమ్ము’. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం ఈ నెల19న (october 19) అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Published : 06 Oct 2022 16:16 IST

హైదరాబాద్‌: తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో  అలరించింది ఐశ్వర్య లక్ష్మి. ఈ నటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అమ్ము’. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం ఈ నెల19న (october 19) అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసింది. ‘నా పేరు అమ్ము, నేను అందరి అమ్మాయిల్లాగే ఎప్పుడెప్పుడు నా రాకుమారుడి చేయి పట్టుకుని రంగుల ప్రపంచంలో విహరిద్దామా అని కలలు కనేదాన్ని..కానీ..’ అనే డైలాగ్‌తో ఉన్న ఈ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ఫ్యామిలీ కథాంశంతో రానున్న ఈ సినిమాకు కార్తీక్‌ సుబ్బరాజు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌. చారుకేశ్‌ శేఖర్‌ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, సింహా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts