Amy Jackson: లుక్‌పై విమర్శలు.. అమీ జాక్సన్‌ ఏమన్నారంటే..?

తన లుక్‌ విషయంలో ఇటీవల విపరీతమైన ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు నటి అమీజాక్సన్‌ (Amy Jackson). ఆమె లుక్‌పై పలువురు దారణంగా విమర్శలు చేశారు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.

Updated : 25 Sep 2023 19:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి అమీజాక్సన్‌ (Amy Jackson) లుక్‌పై ఇటీవల పలు విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఐరిష్‌ నటుడు సిలియన్ మర్ఫీని పోలినట్టు ఆమె లుక్‌ ఉందంటూ పలువురు ట్రోలింగ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు.

‘‘ఆన్‌లైన్‌ వేదికగా భారతీయుల నుంచి ఇలాంటి విమర్శలు రావడం నిజంగా విచారకరం. సినిమాకు అనుగుణంగా లుక్‌ విషయంలో తరచూ మార్పులు చూపించే అగ్ర నటులతో వర్క్‌ చేశా. ఏదైనా సినిమా కోసం లుక్‌పరంగా మార్పులు చూపిస్తే వాళ్లను ప్రశంసిస్తారు. కానీ, నన్ను మాత్రం విమర్శిస్తున్నారు. ప్రస్తుతం యూకేలో ఓ సినిమా చేస్తున్నా. ఆ సినిమా కోసమే లుక్‌ మార్చుకున్నా’’ అని ఆమె చెప్పారు. అనంతరం, సిలియన్ మర్ఫీ లుక్‌తో తన లుక్‌ను పోల్చడంపై మాట్లాడుతూ.. ‘‘అందుకు నేనేమీ బాధపడటం లేదు. అలాంటి అద్భుతమైన నటుడితో నన్ను పోల్చినందుకు ఆనందిస్తున్నా’’ అని ఆమె సరదాగా చెప్పారు.

King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్‌ సల్మాన్‌ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు నటి అమీ జాక్సన్‌. 2018లో విడుదలైన ‘2.ఓ’ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఓ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆమె.. ఆ ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆమె లుక్‌ చూసి నెటిజన్లు షాకయ్యారు. ‘అమీజాక్సన్‌కు ఏమైంది?ఎందుకు ఇలా మారిపోయింది?’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు