Ananya Nagalla: అగ్ర నిర్మాత చిన్న కొడుకుతో పెళ్లి వార్తలు.. అనన్య ఆగ్రహం

అనన్య త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారని పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి.

Published : 02 Oct 2022 12:07 IST

హైదరాబాద్‌: ‘మల్లేశం’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ భామ ప్రస్తుతం కెరీర్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనన్య త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారని పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి.

వీటిపై స్పందిస్తూ అనన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాకోసం వరుడిని వెతికినందుకు ధన్యవాదాలు. ఇక.. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నారో నాక్కూడా దయచేసి తెలియజేయండి. దానివల్ల నా పెళ్లికి నేను కూడా హాజరు కాగలను’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘వకీల్‌సాబ్‌’, ‘మ్యాస్ట్రో’  చిత్రాల తర్వాత అనన్య ‘శాకుంతలం’లో నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని