Ananya Panday: యంగ్ హీరోతో ప్రేమకు అనన్య ఫుల్స్టాప్ పెట్టేసిందా..?
అనన్య బ్రేకప్‌పై ఆంగ్ల పత్రికల్లో వరుస కట్టిన వార్తలు
ముంబయి: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ భామ అనన్య పాండే. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ చిన్నది ప్రసుత్తం బాలీవుడ్లోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘లైగర్’తో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్ యువ నటుడు, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో అనన్య రిలేషన్లో ఉన్నట్లు కొంత కాలం నుంచి వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి ‘ఖాళీ పీలీ’ అనే సినిమా కోసం వర్క్ చేశారు. ఆ సినిమా షూట్ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడిందని, అది ప్రేమకు దారి తీసిందని అప్పట్లో అందరూ చెప్పుకొన్నారు. తరచూ వీరిద్దరూ టూర్స్‌కు వెళ్లి రావడం, షాహిద్ నివాసంలో జరిగే పలు ఫంక్షన్స్‌లో అనన్య సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలవడం ఈ ప్రేమ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో అనన్య-ఇషాన్ విడిపోయినట్లు తాజాగా పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్