Ananya Nagalla: తమిళ సీమలోకి అనన్య

‘మల్లేశం’, ‘వకీల్‌ సాబ్‌’, ‘మ్యాస్ట్రో’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన తెలుగు నటి అనన్య నాగళ్ల. ప్రస్తుతం సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. కాగా.. ఇప్పుడామె ‘అంజల్‌’తో తమిళ

Updated : 15 Apr 2022 11:24 IST

‘మల్లేశం’, ‘వకీల్‌ సాబ్‌’, ‘మ్యాస్ట్రో’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన తెలుగు నటి అనన్య నాగళ్ల. ప్రస్తుతం సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. కాగా.. ఇప్పుడామె ‘అంజల్‌’తో తమిళ ఇండస్ట్రీలోకి కాలుమోపేందుకు సిద్ధమవుతోంది. తమిళ హీరో శశికుమార్‌ నటిస్తున్న చిత్రమిది. తంగం పా.శరవణన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇ.మోహన్‌ నిర్మాత. దక్షిణ భారతదేశమంతా ప్రయాణించే ఓ ట్రావెలర్‌ కథతో రూపొందుతోంది. ఇప్పుడిందులో శశికుమార్‌కు జోడీగా అనన్య కనిపించనుంది. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని