Anasuya: అలా బతకొద్దు

అనసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో జయశంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరి’. శేషు మారం రెడ్డి, శ్రీనివాస్‌ రామిరెడ్డి నిర్మిస్తున్నారు.

Updated : 25 Jun 2022 08:58 IST

అనసూయ భరద్వాజ్‌ (Anasuya), సాయికుమార్‌ (SaiKumar) ప్రధాన పాత్రల్లో జయశంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరి’ (Ari). శేషు మారం రెడ్డి, శ్రీనివాస్‌ రామిరెడ్డి నిర్మిస్తున్నారు. శుభలేఖ సుధాకర్‌, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ లోగోను హుజూరాబాద్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడే నాకు కుతూహలం కలిగింది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఉంది. ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఇందులో చాలా ఎంటర్‌టైన్‌గా చూపించారు దర్శకుడు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘అరి అనేది సంస్కృత పదం. దానికి శత్రువు అని అర్థం. టైటిల్‌ ఎందుకిలా పెట్టాను అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నా ‘పేపర్‌బాయ్‌’ కంటే ఈ చిత్రానికి మరింత పేరు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చిత్ర దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మనిషి ఎలా బతకాలో ఇంతకు ముందు సినిమాలు చూపించాయి. ఈ చిత్రంలో మనిషి ఎలా బతక కూడదో చూపించాం. ఇందులో మంచి కామెడీ ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వై.రవిశంకర్‌, బుచ్చిబాబు, అనూప్‌ రూబెన్స్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని