Anasuya Bharadwaj: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్‌ అనసూయ

ట్విటర్‌ వేదికగా తనను ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేశారు. సంబంధిత మేసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్‌ మీడియాలో ఉంచారు.

Published : 30 Aug 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటి, వ్యాఖ్యాత అనసూయ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ట్విటర్‌ వేదికగా తనను ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేశారు. సంబంధిత మేసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్‌ మీడియాలో ఉంచారు. ‘‘నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైంది. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదు చేయాలా, వద్దా? అని చాలా ఆలోచించా. కానీ, జరగాల్సింది.. జరగాలి. నా కంప్లైంట్‌కి స్పందించి, నాకు మద్దుతు ఇచ్చిన సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ధన్యవాదాలు’’ అని అనసూయ ట్వీట్ చేశారు.  #SayNoToOnlineAbuse, #StopAgeShaming అనే హ్యాష్‌ట్యాగ్‌లు జతచేశారు.

‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ, రావటం మాత్రం పక్కా!!’  అని ఈ నెల 25న అనసూయ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ హీరోని ఉద్దేశించి ఆమె అలా రాశారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయను విమర్శిస్తూ వరుస కామెంట్లు, మీమ్స్‌ పెట్టారు. ఈ క్రమంలో ‘ఆంటీ’ అంటూ కొందరు కావాలనే అవమానిస్తున్నారని, అలా అన్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనసూయ ఇటీవల హెచ్చరించారు. కంప్లైంట్‌ చేసిన తర్వాతా కొందరు నెటిజన్లు అసభ్యపదజాలంతో మీమ్స్‌, ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్‌ చేయటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు