Anasuya: జాలి కోసం ఏడ్చే పిరికిదానిని నేను కాదు.. : అనసూయ
సోషల్‌మీడియాలో గత కొన్నిరోజుల నుంచి ట్వీట్స్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు నటి అనసూయ (Anasuya). తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
హైదరాబాద్: టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరో తన పేరు ముందు ‘THE’ అని పెట్టుకోవడాన్ని తప్పుబడుతూ నటి, వ్యాఖ్యాత అనసూయ (Anasuya) గత కొన్నిరోజులనుంచి నెట్టింట వ్యంగ్యంగా ట్వీట్స్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెకు, సదరు హీరో అభిమానులకు మధ్య ట్విటర్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇతరుల నుంచి సానుభూతి పొందడం కోసం ఏడ్చి గగ్గోలు పెట్టడం తనకు నచ్చదని, తాను అలాంటి వాటికి వ్యతిరేకినని ఆమె చెప్పారు.
‘‘నువ్వు ఎవరో నీకు తెలుసు. నీ తప్పు నువ్వు తెలుసుకునే వరకూ నేను ఇలాగే చేస్తుంటాను. నా విషయంలో ఏదైతే చేశావో దాన్ని మర్చిపోకుండా నీకు గుర్తుచేస్తూనే ఉంటాను. ఇలా చేయడం వల్ల పెద్ద ఎత్తున నెగెటివిటీ ఎదుర్కొంటానని నాకు తెలుసు. అయినప్పటికీ నిజం, మంచితనం, భగవంతుడిపై నాకు నమ్మకం ఉంది. వాటి నుంచే నేను మరింత శక్తి పొందుతున్నాను. ఏడ్చి గగ్గోలు పెట్టి సానుభూతి పొందే పిరికిదాన్ని కాదు. దానికి నేను వ్యతిరేకిని. నన్ను ఎంత కిందకు లాగినా, నాపై బురద చల్లినా నేను ఇలాగే ఫైట్ చేస్తుంటా. ఎందుకంటే.. వీటన్నింటికీ అర్థం చెప్పే ఒక రోజు వస్తుందని నేను నమ్ముతున్నా. పని లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నానని అనుకోకండి.. ఇది కూడా నా బాధ్యతే. నువ్వు నాలోని ఒక తల్లిని టార్గెట్ చేశావు కదా..! ఆ తల్లి ఎంత ధైర్యవంతురాలో నీకు చూపిస్తా’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వీరి మధ్య సోషల్‌మీడియా వార్ ఎప్పటికి ముగియనుంది అని అనుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ