Anasuya: మనం పర్‌ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు..కానీ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనసూయ
పెళ్లిరోజు సందర్భంగా అనసూయ (Anasuya Bharadwaj) ఓ వీడియో పోస్ట్ చేసింది. తన భర్తను ఉద్దేశిస్తూ ఎమోషనల్ నోట్ రాసింది.
ఇంటర్నెట్ డెస్క్: యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది అనసూయ (Anasuya Bharadwaj). ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఎలాంటి విషయంలో అయినా తన అభిప్రాయాన్ని తెలియచేస్తుంటుంది. ఈరోజు తన పెళ్లిరోజు సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన భర్త భరద్వాజ్ గురించి.. తనతో ప్రేమ, పెళ్లిపై మనసులోని భావాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది.
భర్తతో కలిసి బీచ్‌లో ఉన్న వీడియో షేర్ చేసిన అనసూయ..‘‘2001లో నువ్వు నాకోసం రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నీపై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాను.. ఇన్నేళ్ల మన జీవితంలో ఎంతోమంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు. వాటిని పట్టించుకోకుండా నాపై ఇంత ప్రేమ చూపుతున్నావు. మన వివాహబంధాన్ని ఎంతో అద్భుతంగా నిలబెడుతున్నావు. ఇప్పటి వరకు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఒక్కోసారి నువ్వు నాపై చూపించే ప్రేమకు, నీ సహనానికి నేను కూడా ఆశ్చర్యపోతుంటాను. మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం. మనం పర్‌ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు.. కానీ కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుంటున్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు’’అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను తెలిపింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా అనసూయకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.