Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)తో తనకు విభేదాలు ఎలా మొదలయ్యాయో అనసూయ (Anasuya) తాజాగా వెల్లడించారు.

Published : 09 Jun 2023 01:42 IST

హైదరాబాద్‌: నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో వార్‌పై నటి అనసూయ (Anasuya) తొలిసారి స్పందించారు. గతంలో విజయ్‌ తనకు మంచి స్నేహితుడని, కొన్ని పరిస్థితుల వల్ల తమ మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్‌ ఆన్‌లైన్‌ వార్‌పై మాట్లాడారు.

‘‘విజయ్‌ దేవరకొండ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy)లో అభ్యంతరకర పదాలను మ్యూట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌ విజిట్‌కు వెళ్లి ఆయన.. అక్కడ ఉన్న అభిమానులతో ఆ పదాలను పలికించారు. ఒక తల్లిగా అది నన్నెంతో బాధించింది. ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆయనతో చెప్పా. ఆ తర్వాత నాపై ఆన్‌లైన్‌ ట్రోల్స్‌ మొదలయ్యాయి. ధైర్యంగా ఆ బాధ నుంచి బయటకు వచ్చిన నేను (విజయ్‌ నిర్మించిన చిత్రం) ‘మీకు మాత్రమే చెప్తా’లో నటించాను. విజయ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్‌ చేయడం కోసం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్‌ అయ్యాను. విజయ్‌కు తెలియకుండానే ఇది జరుగుతోందా? అనిపించింది. విజయ్‌ నన్ను ద్వేషిస్తున్నాడో, లేదో నాకు తెలియదు. కానీ, ఇక్కడితో దీన్ని ఆపేయాలని, ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత కావాలి’’ అని ఆమె చెప్పారు.

అనసూయ-విజయ్‌ దేవరకొండ మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌ వార్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె తరచూ విజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్స్‌ చేసేవారు. ఇటీవల ఆయన నటించిన ‘ఖుషి’ పోస్టర్‌పై ‘ది విజయ్‌ దేవరకొండ’ అని ఉండటాన్ని తప్పుబడుతూ ఆమె వరుస ట్వీట్స్‌ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్‌ అభిమానులు ఆమెను ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని