Anasuya: ‘గాడ్‌ఫాదర్‌’.. అందుకే దూరంగా ఉన్నా: అనసూయ

చిరంజీవి-మోహన్‌రాజా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). వ్యాఖ్యాత అనసూయ (Anasuya) ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కడా కనిపించలేదు. దానిపై ఆమె తాజాగా పెదవి విప్పారు.

Published : 06 Oct 2022 10:07 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో యాంకర్‌ అనసూయ ఓ కీలక పాత్ర పోషించారు. న్యూస్‌ ఛానెల్‌ రిపోర్టర్‌గా ఆమె స్క్రీన్‌పై కనిపించిన కొన్ని క్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో అనసూయ యాక్టింగ్‌ని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌.. ‘‘గాడ్‌ఫాదర్‌’లో మీ రోల్‌ నాకెంతో నచ్చింది. సినిమాలో ఇంత మంచి రోల్‌ చేసినప్పటికీ మీరెందుకు ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు’’ అని ట్వీట్‌ చేశాడు. దానిపై అనసూయ స్పందించారు. ‘‘మీరు నమ్మాలి.. చాలా షూట్స్‌ ఒకేసారి జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నా’’ అంటూ తాను వరుస షూట్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిపారు. ఇక అనసూయ ఇటు సినిమాలు, అటు షోలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోన్న విషయం తెలిసిందే.

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌’ సిద్ధమైంది. మోహన్‌రాజా దర్శకుడు. మాతృకతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు తగినట్లు పలు మార్పులు చేసి ‘గాడ్‌ఫాదర్‌’ను తెరకెక్కించారు. ఇందులో చిరు బ్రహ్మాగా నటించారు. ప్రతినాయకుడిగా సత్యదేవ్‌ మెప్పించారు. నయనతార, సల్మాన్‌ఖాన్‌, పూరీ జగన్నాథ్‌, సునీల్‌, గెటప్‌ శ్రీను.. ఇలా ఎంతోమంది స్టార్స్‌ ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అందుకుంది. చిరు అదరగొట్టేశారని మెగా అభిమానులు మెచ్చుకుంటున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని