Anasuya Bharadwaj: మీ అనారోగ్యానికి కారణం తెలుసుకోవచ్చా?: నెటిజన్‌కు అనసూయ కౌంటర్‌

తనపై కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు అనసూయ కౌంటర్‌ వేశారు. ఏం జరిగిందంటే?

Published : 23 Jun 2024 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సినీనటుల్లో అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj) ఒకరు. సినీ అప్‌డేట్స్‌, ఫ్యామిలీ పిక్స్‌ పంచుకోవడంతోపాటు నెటిజన్లు చేసే కామెంట్లపైనా ఆమె స్పందిస్తుంటారు. తాజాగా తన గురించి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. ఏమైందంటే.. అనసూయ పాల్గొన్న ఓ టీవీ కార్యక్రమానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘ఏంటీ నాన్సెన్స్‌ అనసూయ..? ఏదైనా అంటే విక్టిమ్‌ కార్డ్‌ప్లే చేస్తారు (బాధితురాలిగా నటిస్తూ సానుభూతి ఆశించడం)’’ అని సదరు ఎక్స్‌ యూజర్‌ పేర్కొన్నాడు. వాంతి చేసుకున్నట్టు కనిపించే ఎమోజీలను జోడించాడు. వీటిని ఉద్దేశిస్తూనే అనసూయ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘మీరిలా తీవ్ర అనారోగ్యంగా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? ఎమోజీ, మీ మైండ్‌ విషయంలో..’ అని రిప్లై ఇచ్చారు.

ఆ నెటిజన్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో.. ఓ ఛాలెంజ్‌లో భాగంగా అనసూయ తన కోట్‌ తీస్తూ, ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ చొక్కా విప్పుతూ కనిపించారు. గతంలోనూ పలువురు నెటిజన్లు అనసూయను ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశ పూర్వకంగా విమర్శించిన వారిపై చర్చలు తీసుకోవాలంటూ ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సైతం ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని