Anasuya: యాంకర్‌ అనసూయ ఇంట విషాదం!

ప్రముఖ యాంకర్‌.. నటి అనసూయకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి సుదర్శన్‌ రావ్‌(63) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. రాజీవ్‌ గాంధీ హయాంలో సుదర్శన్‌ రావు యూత్‌

Updated : 05 Dec 2021 12:36 IST

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి సుదర్శన్‌ రావు(63) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. సుదర్శన్‌ రావు కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలం పాటు పనిచేశారు. రాజీవ్‌ గాంధీ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన మృతితో అనసూయ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని