Anasuya: విజయ్ దేవరకొండతో మాట్లాడటానికి ప్రయత్నించా: అనసూయ
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో వివాదంపై తాజాగా జరిగిన ‘విమానం’ సక్సెస్ మీట్‌లో అనసూయ (Anasuya) మాట్లాడారు.
హైదరాబాద్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో వివాదంపై నటి అనసూయ (Anasuaya) మరోసారి తాజాగా మాట్లాడారు. విజయ్ టీమ్‌లోని ఓ వ్యక్తి పలువురు నెటిజన్లకు డబ్బులిచ్చి తనపై ట్రోల్స్ సృష్టిస్తున్నాడని తెలుసుకుని తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. ఈ విషయంపై విజయ్‌తో మాట్లాడటానికి ప్రయత్నించానని అన్నారు. కాకపోతే, పీఆర్‌ల కారణంగా కుదరలేదని ఆమె పరోక్షంగా చెప్పారు. ‘విమానం’ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె ఈ వివాదంపై మాట్లాడుతూ..
‘‘విమానం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో వివాదంపై మాట్లాడాను. వివాదానికి గల కారణాన్ని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. కాకపోతే కుదరలేదు. మొదటిసారి ఆ ఇంటర్వ్యూలో చెప్పాను. విజయ్ టీమ్‌లోని ఒక వ్యక్తి నాపై సోషల్‌మీడియాలో ట్రోల్స్ క్రియేట్ చేయిస్తున్నాడని తెలుసుకుని బాధపడ్డాను. ఒక మహిళను ఇలా ఎలా అవమానిస్తారని కోపం వచ్చింది. సమయం వచ్చినప్పుడల్లా వివాదం గురించి మాట్లాడాలనుకున్నా. ఈ విషయంపై విజయ్‌తో మాట్లాడాలని ప్రయత్నించాను. నాకు పీఆర్‌లు లేరు. నాకు నేనే స్పోక్స్ పర్సన్. నాకు ఆత్మగౌరవం ఉంది. ఇక, మానసిక ప్రశాంతత కోసమే ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలనుకుంటున్నా’’ అని అనసూయ తెలిపారు.
అనంతరం ఆమె ‘విమానం’ గురించి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు శివప్రసాద్ ఈ కథ చెప్పినప్పుడు బాగా ఏడ్చేశాను. ప్రతి సినిమా మాదిరిగానే ఈ చిత్రానికీ కష్టపడి వర్క్ చేశా. వేశ్య పాత్ర పోషించినందుకు ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అది కేవలం పాత్ర మాత్రమే. నేనెంటో నాకు తెలుసు. ఈ కథ విన్నప్పుడు ‘మాతృదేవో భవ’ సినిమా గుర్తుకువచ్చింది. నిజంగానే నాన్న ఒక హీరో. ఏడాది క్రితం నేను నా తండ్రిని కోల్పోయాను. ఇలాంటి గొప్ప కథలో భాగం కావాలనుకున్నా. అందుకే నటించాను. దర్శకుడు చెప్పిన విధంగా ఈ పాత్రలో నటించాను. ప్రస్తుతం ‘పుష్ప-2’ షూట్‌లో బిజీగా ఉన్నాను. త్వరలోనే నా కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తా’’ అని చెప్పారు.
సముద్రఖని మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. శివ ప్రసాద్ నన్ను సంప్రదించినప్పుడు నేను ‘బ్రో’ పనుల్లో బిజీగా ఉన్నాను. ‘విమానం’లో వెంటనే భాగం కాలేనని చెప్పా. దానికి దర్శకుడు ఓకే అన్నారు. అలా, ఈ ప్రాజెక్ట్‌లో నటించాను’’ అని చెప్పారు. ఇదే ప్రమోషన్‌లో ఆయన ‘బ్రో’ గురించి మాట్లాడుతూ.. ‘‘టీజర్ సిద్ధమవుతోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఫస్టాఫ్ డబ్బింగ్ పూర్తైంది. పవన్‌కల్యాణ్ ఓకే అంటే ఆయనతో 100 సినిమాలైనా చేస్తా’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు