Anasuya: ప్రెస్‌మీట్‌లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
‘రంగమార్తాండ’ (Rangamarthanda) సినిమాలో నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నటి అనసూయ (Anasuya). తాజాగా జరిగిన ఈసినిమా ప్రెస్‌మీట్‌లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
హైదరాబాద్: బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ (Anasuya) భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం జరిగిన ‘రంగమార్తాండ’ (Rangamarthanda) ప్రెస్‌మీట్‌లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సినిమా ఫైనల్ కాపీ చూసి తనకి కన్నీళ్లు వచ్చేశాయని అన్నారు. ‘‘సినిమా ప్రమోషన్స్ విషయంలో కంగారు పడి తరచూ మా దర్శకుడు కృష్ణవంశీకి కాల్ చేసేదాన్ని. సర్.. ప్రమోషన్స్ ఇంకా మొదలుపెట్టలేదు ఎలా? అని ఆయన్ని అడగ్గా ‘మన సినిమా మాట్లాడుతుంది’ అని సమాధానం ఇచ్చేవారు. ఈ క్షణం చాలా ఎమోషనల్‌గా ఉంది. ‘రంగమార్తాండ’ వంటి గొప్ప సినిమాలో భాగం అయ్యాను. నా జీవితానికి ఇది చాలు. సోమవారం సాయంత్రం ఈ సినిమా చూశాను. అక్కడే ఆగిపోయాను. సినిమాలో నటించాను కదా.. దీన్ని అంత ఎమోషనల్ కానులే అనుకుని ధైర్యం, పొగరుగా వెళ్లి షోలో కూర్చొన్నాను. ఉన్నట్టుండి కన్నీరు ఆగలేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది’’ అని ఆమె అన్నారు.
సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత కృష్ణవంశీ (Krishna Vamsi) నుంచి వస్తోన్న చిత్రమిది. మరాఠీలో మంచి విజయాన్ని అందుకున్న ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. అంతరించుపోతోన్న నాటకరంగం, దానివల్ల రంగస్థల నటుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే అంశంతో ఇది రూపుదిద్దుకుంది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించగా.. శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, అలీ రెజా వంటి వారు ముఖ్య భూమికల్లో నటించారు. ఉగాది కానుకగా బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’