Anasuya Bharadwaj: స్టార్ హీరోపై అనసూయ ప్రశంసలు
స్టార్ యాంకర్ అనసూయ(Anasuya) ఎప్పుడూ సోషల్మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా కాంతార(Kantara) సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాద్: ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన చిత్రం కాంతార(Kantara). ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మొదట కన్నడలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లోనే పాన్ ఇండియా మూవీగా అందరి ఆదరణ పొందింది. రూ.15 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు చేసి అన్ని భాషల్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. తాజాగా స్టార్ యాంకర్ అనసూయ(Anasuya) కాంతార సినిమా గురించి మాట్లాడారు.
కాంతారలో హీరో నటనపై అనసూయ మాట్లాడుతూ..‘ఈ సినిమాలో రిషబ్ శెట్టి(Rishabh Shetty) అద్భుతంగా నటించారు. ఆయన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దానిలో నుంచి బయటపడలేకపోతున్నా’’ అని చెప్పింది. నిజానికి చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదే. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలోని ‘ఓఁ’ అనే సౌండ్ కొన్ని నిమిషాల పాటు వెంటాడుతుందని అంతగా ఈ శబ్దం ప్రభావం చూపుతుందని అంటారు. ఇదే విషయాన్ని అనసూయతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కూడా ఇటీవల ఈ హీరోను ప్రత్యేకంగా కలిసి అభినందించిన విషయం తెలిసిందే. ఇక యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’(Ranga Marthanda) చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. ‘పుష్ప2’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం