Rashmi: రష్మిపై నెటిజెన్‌ సెటైర్‌.. కూల్‌ రిప్లై ఇస్తూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన యాంకర్‌

తాజాగా ఇన్‌స్టాలో రష్మి చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. దీనిపై ఓ నెటిజన్‌ రష్మిను ట్యాగ్‌ చేస్తూ విమర్శించగా, అతడికి రిప్లై ఇచ్చింది.

Published : 25 Nov 2022 01:36 IST

హైదరాబాద్‌: ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణిస్తున్నారు రష్మి గౌతమ్‌. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఆమె, ఆసక్తికర అంశాలపై స్పందిస్తారు. సెటైర్లు, కౌంటర్లు వేసే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాలో ఆమె చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. దీనిపై ఓ నెటిజన్‌ రష్మిను ట్యాగ్‌ చేస్తూ విమర్శించగా, అతడికి రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
‘‘వాళ్లు యాంకర్స్‌ కాదు మావ.. హీరోయిన్స్‌ ఎలా అవ్వాలో తెలియక ఉండిపోయిన హీరోయిన్స్‌ రా మావ’’ అనే మీమ్‌ పోస్టర్‌ రష్మి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ, ‘‘ఇది నిజమండీ.. ఇంకో కామన్‌ పాయింట్‌ మిస్‌ చేశారు. ఫొటోలో ఉన్న అమ్మాయిలు అందరూ తెలుగు ప్రాంతాల్లో పుట్టారు. బాంబే బోర్డింగ్‌ పాస్‌ ఉంటే, కథ వేరేగా ఉండేదేమో. అప్పుడు మేము వేసుకొనే బట్టలకు కూడా ట్రెండ్‌ సెట్టింగ్‌ గా ఉండేదేమో’’ అని పేర్కొన్నారు.

దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ, ‘తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని, మీరు తెలుగు ప్రాంతాల్లో పుట్టారని చెప్పుకోవడం వల్ల సానుభూతి రాదు రష్మి’ అని కౌంటర్‌ ఇస్తూ ఆమెని ట్యాగ్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై రష్మి తనదైన శైలిలో స్పందించింది. ‘అవును ఎందుకంటే, గ్రూపిజం లేకుండా ఉండేందుకు ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించని ఓ సీబీఎస్‌ఈ స్కూల్లో నేను చదివాను. కాబట్టి మీరు నాపై నిందమోపలేరు. నా తల్లి ఒరియా, తండ్రి యూపీకి చెందిన వారు. అందరిలాగానే నా మాటల్లోనూ కాస్త ఆ యాస వినిపిస్తుంది’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. మరో నెటిజన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ తన భాషను వెక్కిరిస్తూ మాట్లాడే వాళ్ల గురించి పట్టించుకోనని అన్నారు. మీమ్‌పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ చిత్రంలో నటించిన రష్మి, ప్రస్తుతం మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు