Anchor Ravi: ఇకపై.. సోషల్‌ మీడియాలో అసత్య సందేశాలు పెట్టాలంటే భయపడాలి

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ని ట్రోలింగ్‌ చేయడం, నెగెటివ్‌ ప్రచారాలు చేసే వారిపై యాంకర్‌ రవి సీరియస్‌ అయ్యారు. కేవలం కంటెస్టెంట్స్‌ గురించే కాకుండా వారి కుటుంబసభ్యులపైనా నెగెటివ్‌ కామెంట్స్‌ రావడంతో ఆగ్రహానికి గురైన రవి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Updated : 16 Dec 2021 16:27 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ని ట్రోలింగ్‌ చేయడం, నెగెటివ్‌ ప్రచారాలు చేస్తున్న పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌పై యాంకర్‌ రవి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం పోటీదారుల గురించే కాకుండా వారి కుటుంబసభ్యులపైనా నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడంతో ఆగ్రహానికి గురైన రవి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘‘ ఇప్పటినుంచి ఇతరుల గురించి తప్పు మాట్లాడాలన్నా, వారి గురించి ఆన్‌లైన్‌లో ఎలాంటి వెకిలిరాతలు రాయాలన్నా భయం కలగాలి. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు కచ్చితంగా కఠినచర్యలు చేపడుతారు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఇందులో అసత్యవార్తలపై పోలీసులకు ఆధారాలతోపాటు చూపిస్తున్నట్టు తెలుస్తోంది ‘‘ మీరు చేయాల్సింది మీరు చేయండి.. నేను చేయాల్సింది నేను చేస్తా. కానీ ద్వేషపూరిత సందేశాలు పెట్టేముందు ఒక 30 సెకన్లు ఆలోచించండి’’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే చెడు సందేశాలను ఆపి.. పాజిటివిటీని పెంపొందించి.. సామాజిక దుర్వినియోగంపై పోరాడేందుకే ఈ పోరాటం చేస్తున్నానని రవి తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు