‘ఖుషి’ రీమేక్‌ చేయగలిగిన ఒకే ఒక్క నటుడు ఆయనే : సాయిధరమ్‌ తేజ్‌

వైష్ణవ్‌ తేజ్‌, కేతికశర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగరంగ వైభవం’. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథులుగా

Published : 01 Sep 2022 02:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, కేతికశర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగరంగ వైభవం’. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథులుగా విచ్చేసిన మెగా యువ నటులు సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ముగ్గురు యువనటులపై యాంకర్‌ సుమ రాపిడ్ ఫైర్‌ ప్రశ్నలు సంధించగా తమదైనా జవాబులతో ప్రేక్షకులను మెప్పించారు. అందులో ప్రధానంగా...

మీ ముగ్గురిలో సోషల్‌మీడియా వాడేది ఎవరు?

సాయిధరమ్‌ తేజ్‌: నేను

ముగ్గురిలో అబద్ధాలు చెప్పేదెవరు?

వరుణ్‌తేజ్‌: సాయిధరమ్‌ తేజ్‌ అస్సలు చెప్పుడు. ఒకప్పుడు నేను చెప్పేవాడిని. ఇప్పుడు వీడు(వైష్ణవ్‌) చెబుతున్నాడు.

ముగ్గురిలో తెలివితేటలు ఎవరికి ఉన్నాయి?

వైష్ణవ్‌ తేజ్‌: వరుణ్‌ అన్నయ్యకు ఎక్కువగా ఉన్నాయి. (వెంటనే వరుణ్‌ అందుకుని వైష్ణవ్‌కే ఎక్కువ ఉన్నాయి. ఏదో కావాలని నా పేరు చెబుతున్నాడు)

మీకు చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇద్దరిలో ఎవరెక్కువ ఇష్టం?

వరుణ్‌తేజ్‌: నేను, చరణ్‌(రామ్‌చరణ్) అన్న చిరంజీవి టీమ్. వైష్ణవ్‌ తేజ్‌, సాయితేజ్‌ ఇద్దరూ పవన్‌కల్యాణ్ టీమ్‌.

మీలో రొమాంటిక్‌ సాంగ్స్‌లో ఎవరు బాగా నటిస్తారు?

వరుణ్‌తేజ్‌:సాయిధరమ్‌ తేజ్‌: మాకంటే వైష్ణవ్‌తేజ్‌ బాగా నటిస్తాడు. రొమాన్స్‌ వాడికే బాగా సెట్ అవుతుంది.

మీ ముగ్గురూ కలిసి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ పెడితే దానికి పేరేం పెడతారు?

సాయిధరమ్‌ తేజ్‌: త్రీ మస్కిటియర్స్‌

ముగ్గురిలో బద్ధకం ఎవరికి ఎక్కువ?

వరుణ్‌తేజ్‌: నాకే బద్ధకం ఎక్కువ.

చిన్నప్పుడు ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారు?

వరుణ్‌తేజ్‌: సాయిధరమ్‌ తేజ్‌: మేమిద్దరం ఒక ఏజ్‌గ్రూప్‌ అందుకే మేమిద్దరం స్కూల్లో బాగా అల్లరి చేసేవాళ్లం. వైష్ణవ్‌ మాకంటే చిన్నోడు అందుకే సైలెంట్‌గా ఉండేవాడు.

ఎప్పుడైనా అమ్మాయి విషయంలో మీ ముగ్గురు గొడవపడ్డారా?

సాయిధరమ్‌ తేజ్‌: దేవుడి దయ వల్ల ఇప్పటివరకైతే అవ్వలేదు.

‘ఖుషి’ రీమేక్‌ చేస్తే మీలో ఎవరు సెట్‌ అవుతారు?

సాయిధరమ్‌ తేజ్‌: ఆ రోల్‌ చేయగలిగిన నటుడు ‘వన్‌ అండ్ ఓన్లీ పవర్‌స్టార్‌’. ఇంకెవరికీ సాధ్యం కాదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని