Anchor Suma: సుదర్శన్‌లో విజువల్స్‌ చూసి సుమ షాక్‌..!

థియేటర్‌ బయట భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. థియేటర్‌ లోపల ఇసుక వేస్తే రాలనంతమంది జనాలు.. విజయ్‌.. విజయ్‌ అంటూ కేకలు.. ఇది ఈరోజు ‘లైగర్‌’(Liger) ట్రైలర్‌ విడుదల వేడుకలో దర్శనమిచ్చిన చిత్రాలు..

Updated : 21 Jul 2022 16:10 IST

ఇలాంటి ఈవెంట్‌ ఈ మధ్య కాలంలో చూడలేదంటూ కామెంట్‌

హైదరాబాద్‌: థియేటర్‌ బయట భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. థియేటర్‌ లోపల ఇసుక వేస్తే రాలనంతమంది జనాలు.. విజయ్‌.. విజయ్‌ అంటూ కేకలు.. ఇది ఈరోజు ‘లైగర్‌’(Liger) ట్రైలర్‌ విడుదల వేడుకలో దర్శనమిచ్చిన చిత్రాలు. ఇవన్నీ చూసి యాంకర్‌ సుమ (Suma) షాక్‌ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రోగ్రామ్‌ చూడలేదంటూ కామెంట్‌ చేశారు. అభిమానులందర్నీ ఆకట్టుకునేలా ప్రోగ్రామ్‌ హోస్ట్‌ చేయడానికి ఆమె ఏకంగా మూడు మైకులు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

‘అర్జున్‌రెడ్డి’తో (Arjun Reddy) మాస్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్న విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘లైగర్‌’. పూరీ జగన్నాథ్‌ (Puri jagannadh) దర్శకుడు. గురువారం ‘లైగర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో జరిగింది. దీని కోసం అభిమానులు 75 అడుగుల ఎత్తున్న విజయ్‌ కటౌట్‌ని థియేటర్‌ ఆవరణలో ఏర్పాటు చేశారు. సంప్రదాయ నృత్యాలు, పులి వేషాలు.. ఇలా ఈ కార్యక్రమం ఆద్యంతం వేడుకగా ప్రారంభమైంది. ఇక థియేటర్‌లో ఎటు చూసినా అభిమానులే. ‘విజయ్‌.. విజయ్‌’, ‘పూరీ’.. అంటూ వాళ్లు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మొగింది. ఇదంతా చూసి ప్రోగ్రామ్‌ హోస్ట్‌ చేసిన సుమ షాక్‌ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రోగ్రామ్‌ని తాను చూడలేదని అన్నారు. అభిమానులందరికీ వినిపించేలా మాట్లాడటానికి ఒక్క మైక్‌ సరిపోవడం లేదంటూ.. ఏకంగా మూడు మైక్‌లు పట్టుకున్నారు. ఇక అభిమానుల సందడి చూసి విజయ్‌, పూరీ, అనన్య పాండే, కరణ్‌ జోహార్‌.. చిత్రబృందం సైతం ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని