మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తుండగా రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. దిల్‌రాజు - క్రిష్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Updated : 07 Dec 2022 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తుండగా రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. దిల్‌రాజు - క్రిష్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రానికి సంబంధించి తాజాగా ‘‘మనసా వినవా’’ అనే సాంగ్‌ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చిన ఈ గీతానికి శ్రీరామ చంద్ర, ధన్య బాలకృష్ణ ఆలపించగా శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందించారు. మే 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని