Anger Tales: మరో కొత్త వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Anger Tales: నటుడు సుహాన్‌ నిర్మించిన వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’. మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 26 Feb 2023 15:02 IST

హైదరాబాద్‌: దర్శకుడు వెంకటేశ్‌ మహా, సుహాస్‌, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్‌, రవీంద్ర విజయ్‌, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’ (Anger Tales). ప్రభల తిలక్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురు వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నటుడు సుహాస్‌ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని