Anukoni Prayanam: రాజేంద్రప్రసాద్‌.. ‘అనుకోని ప్రయాణం’

నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అనుకోని ప్రయాణం’. వెంకటేష్‌ పెదిరెడ్ల తెరకెక్కిస్తున్నారు. యాపిల్‌ క్రియేషన్స్‌ పతాకంపై డి.వై.జగన్మోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌,

Updated : 04 Apr 2022 13:25 IST

టుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అనుకోని ప్రయాణం’. వెంకటేష్‌ పెదిరెడ్ల తెరకెక్కిస్తున్నారు. యాపిల్‌ క్రియేషన్స్‌ పతాకంపై డి.వై.జగన్మోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆదివారం విడుదల చేశారు. ‘‘ఓ ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రాజేంద్రప్రసాద్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు అందిస్తున్నారు. ఎన్‌.మల్లికార్జున్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని